తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమిడియన్ గా పాపులారిటీ సంపాదించిన వారిలోఒకరైన దివంగత నటుడు ఏవీఎస్ కూడా ఒకరు.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈయన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ కామెడీ చిత్రాలను నటించడమే కాకుండా విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. నిజానికి ఈయన పేరు వెంకట సుబ్రహ్మణ్యం అయినప్పటికీ తెలుగులో చాలా చిత్రాలలో హాస్యనటుడుగా నటించారు. ఈయన నిర్మాత గానే కాకుండా డైరెక్టర్గా, రచయితగా కూడా ఎన్నో చిత్రాలకు పని చేశారట. ఏవీఎస్ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.


2013లో ఈయన మరణించారు. అయితే ఏవీఎస్ కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ముఖ్యంగా ఈయన కూతురు అల్లుడు కూడా నటులనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వీరిని చూస్తే గుర్తుపడతారు. ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం బుల్లితెర పైన ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ కీలకమైన పాత్రలో నటిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నదట .అలాగే పలు చిత్రాలలో కూడా నటిస్తోందట. శ్రీ ప్రశాంతి సొంతంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలుపెట్టింది. తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. అలాగే తండ్రి జ్ఞాపకాలను కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులకు గుర్తు చేస్తూ ఉంటుంది.


ఇక ఏవీఎస్ కూతురు ప్రశాంతిని వివాహం చేసుకున్న బుల్లితెర నటుడు శ్రీనివాసు కూడా సుపరిచితమే ఎన్నో చిత్రాలలో కూడా నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో సీరియల్లలో నటించారు ఈయన. ప్రస్తుతం చేతినిండా సినిమాల తో క్యారెక్టర్ ఆర్టిస్టులలో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. శ్రీనివాస్  కూడా స్టార్ హీరోల చిత్రాలలో కూడా సైడ్ యాక్టర్ గా నటిస్తూ ఉన్నారు. తాజాగా యాక్టర్  శ్రీ ప్రశాంతి షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: