బిగ్ బాస్ -8 సీజన్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. బిగ్ బాస్ -7 విపరీతమైన క్రేజ్ రావడం జరిగింది. టిఆర్పి పరంగా కూడా బాగానే సంపాదించుకుంది. ఒక ఓటిటి సీజన్ ని పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్. గత సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ అంటేనే కచ్చితంగా ఒకరినొకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ నానా హంగామా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీజన్-7 వినాలి రోజున జరిగిన చర్చ గురించి చెప్పాల్సిన పనిలేదు విన్నర్గా పల్లవి ప్రశాంత్ ని చూడడానికి అభిమానులు సైతం అన్నపూర్ణ స్టూడియో దగ్గర చేరుకొని చాలా రచ్చ చేశారు.


బిగ్ బాస్ -8 సీజన్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ గేమ్ షో మొదలు కాబోతోందని ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తారని విషయం పైన కూడా చాలా మంది యాక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ కమెడియన్ గా పేరు పొందిన కిర్రాక్ ఆర్పి, కుమారి ఆంటీ, బర్రెలక్క, అమృత ప్రణయ్, అనిల్ గిలా పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. వీరందరితోపాటు బుల్లెట్ భాస్కర్ సానియా సింగ్ కొంతమంది యూట్యూబర్స్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.


అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక హాట్ బ్యూటీ పేరు వినిపిస్తోంది ఆ అమ్మ డే రీతూ చౌదరి.. సీరియల్స్ లో నటించి గుర్తింపు సంపాదించుకోలేకపోయినా ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలలో కనిపించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన అంద చెందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఒక టాక్స్ షో కి యాంకర్ గా చేస్తోంది. మరి ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి బి వెళితే కచ్చితంగా రచ్చ రచ్చే ఉంటుందంటూ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. మరి హౌస్ లోకి అడుగుపెడుతుందా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: