తెలుగు బుల్లితెర నటిగా ఎన్నో షోలకు యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హరితేజ.. ఈ అమ్మడు మొదట మనసు మమత అనే సీరియల్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఈ సీరియల్ తో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే మొదటిసారిగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రంలో హీరోయిన్ కోడలుగా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది ముఖ్యంగా బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది హరితేజ..


బిగ్ బాస్ మొదటి సీజన్ లో 16 మంది పాల్గొన్నప్పటికీ అందులో చివరి వరకు వెళ్లి మూడవ స్థానంలో నిలిచింది హరితేజ. బిగ్బాస్ నాలుగో సీజన్ లో కూడా స్టార్ మా లో అతిథిగా ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. హీరోయిన్లకూ తీసిపోని అందం ఉన్నప్పటికీ ఈమెకు కేవలం అడపాదడపా పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాలు విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పలు రకాల షోలు కూడా కనిపిస్తు సందడి చేస్తూ ఉంటుంది.


సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే హరితేజ తాజా ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలను చాలా స్లిమ్ గా మారి స్టైలిష్ లుక్ లో కనిపించింది. ట్రెండీ డ్రస్సులు చాలా సింపుల్ లుక్ లో ఉన్న హరితేజ ఫోటోలు చూసిన అభిమానుల సైతం చాలా క్యూట్ గా ఉన్నాయి ఆకట్టుకుంటున్నాయంటే కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హరితేజ ఏంటి ఇలా మారిపోయింది సింప్లీ సూపర్ అంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం హరి తేజ చేసినటువంటి ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: