చాలామంది సెలబ్రిటీలు ఏ ఇండస్ట్రీలో నైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అంటూ తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో తమకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను సైతం తెలియజేస్తూ ఉంటారు. హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి తమకు ఎదురైన కొన్ని పరిస్థితులను గురించి చాలామంది ఇప్పటికే తెలియజేశారు. అయితే కొంతమంది తారలు ఇప్పటికీ తమకు ఎదురైన పరిస్థితులను డైరెక్ట్ గానే చెప్పడానికి భయపడుతూ ఉన్న సమయంలో మీటూ ఉద్యమంతో ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ తెరమీదకి చాలామంది పేర్లు వినిపించాయి.


ఇప్పుడు తాజాగా మరాఠీ ఇండస్ట్రీ కి చెందిన నటి సాయి తమ్ హంకర్ తనకు ఎదురైన అనుభవాన్ని సైతం వెల్లడించింది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే తన కెరియర్లో ఎదురైన ఒక విషయాన్ని తెలియజేసింది..సాయి తమ్ హంకర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని.. అయితే ఈ అవకాశం తనకు కావాలి అంటే దర్శక నిర్మాతలతో రాత్రంతా గడపాలని చెప్పడంతో ఈ విషయం పైన తను గాటుగానే రియాక్ట్ అయ్యాను అని తెలిపింది.. అలాగే మీ అమ్మను ఎందుకు పంపకూడదు అని ఆ వ్యక్తిని అడగక ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయారని తెలియజేసింది.


ఇక మరెప్పుడూ కూడా అలాంటి ఫోన్ కాల్స్ తనకి రాలేదని వెల్లడించింది సాయి తమ్ హంకర్.. ముఖ్యంగా మనకు సరైన విషయం కాదని తెలిసినప్పుడు ధైర్యంగా చెప్పడం మంచిది అంటూ తెలిపింది. అయితే ఈమె మరాఠీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తన 17 ఏళ్ల వయసులో సీరియల్స్ లో సైడ్ యాక్టర్ గా చేస్తున్న సమయంలో ఇలాంటివి ఎదురయ్యాయని తెలిపింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించకుంది. ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నట్టు తెలిపింది సాయి తమ్ హంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: