కానీ విన్నర్ మాత్రం కాలేకపోయింది.గత కొద్దిరోజులుగా పైమా త్వరలోనే వివాహం చేసుకోబోతోందని అది కూడా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉందని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. తాజాగా ఫైమా సోషల్ మీడియాలో నెటిజెన్లతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను సైతం పలు రకాల ప్రశ్నలు అడగగా వాటికి సమాధానం కూడా తెలియజేసింది.. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటవ్ అక్క అని అడగగా.. తొందర్లోనే అంటూ తెలియజేసింది.తన కాబోయే వాడి ఇంటి పేరును కూడా భాదావత్ అని హింట్ కూడా ఇవ్వడం జరిగింది పైమా.
అలాగే తన పెళ్లి గురించి ఇంకా ఏదైనా అడగాలి అంటే యూట్యూబ్లో బ్లాగులో క్లారిటీ ఇస్తానని కూడా తెలియజేసింది. వీటితో పాటు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టబోతున్నాను వాటిని కూడా సపోర్ట్ చేయండి అంటూ పైన సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని తెలియజేసింది. అయితే గతంలో పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసినప్పటికీ.. అదంతా కేవలం పాపులర్ కోసమే చేశామంటూ బాంబు పేల్చింది. గడిచిన కొద్ది రోజుల క్రితం మరొక వ్యక్తిని చూపించి ఫైమా వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేసింది.