సంపూర్ణేష్ బాబు అసలు పేరు కూడా నరసింహాచారి కానీ హృదయ కాలేయం సినిమాలో ఈయన నటించిన తీరు అందరిని కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా విడుదలయ్యాక తన సొంత ఊరికి వెళ్ళిపోమని సాయిరాజే సంపూర్ణేష్ బాబుకి తెలియజేశారట. సంపూర్ణేష్ బాబు కూడా తన సొంత ఊర్లో బంగారం పని చేసుకునేవారు. నరసింహచారి చాలా పేదవాడు అయినప్పటికీ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తూ ఉండేవారు. సినిమా అవకాశంలా కోసం హైదరాబాద్ కు వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవారట.
సంపూర్ణేష్ బాబు ఎప్పుడు కూడా విచిత్రమైన బట్టలలో చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉండడం ఒకరోజు డైరెక్టర్ సాయి రాజేష్ కంటపడ్డాడట.. తన సినిమాలో నటించమని అడగగా అందుకు ఆశ్చర్యపోయిన సంపూర్ణేష్ బాబు వెంటనే ఓకే చెప్పారట. అలా హృదయ కాలేయం సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ చిత్రంలో మొదట హీరోగా జబర్దస్త్ కమెడియన్ అప్పారావుని అనుకున్నారట. కొన్ని కారణాల చేత అప్పారావు చాలా సినిమాలలో కమెడియన్ గా నటించడంతో ఈ సినిమా కి తీసుకోలేదట. ఈ సినిమాకి కొత్త ఫేస్ అయితే బెటర్ అని భావించిన డైరెక్టర్ సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు ని ఎంచుకున్నారట. ఈ విషయాన్ని ఒక సినిమా షూటింగ్ సమయంలో అప్పారావుకి డైరెక్ట్ గా సంపూర్ణేష్ బాబు తెలియజేశారట. ఈ విషయాన్ని ఇటీవలే అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.