సోషల్ మీడియాలో యూట్యూబ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు.. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక షార్ట్ ఫిలిం తో మంచి పాపులారిటీ అందుకున్నారు. దీంతో షణ్ముఖ వెబ్ సిరీస్ లకు షార్ట్ ఫిలింలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా పాపులారిటీ తోని బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చారు. విన్నర్ అవుతారు అనుకున్న సమయంలో షణ్ముఖ రన్నర్ గా మిగిలిపోయారు.. ఆ తర్వాత ఎంతగానో ప్రేమించిన దీప్తితో బ్రేకప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అలాగే డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడిపోయారు.


కొన్ని రోజుల క్రితం అనుకోకుండా డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో షణ్ముఖ్ ను పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా అయిపోయిన షణ్ముఖ్ ఇప్పుడు తాజాగా డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని సైతం షేర్ చేశారు.. తాను ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను కానీ చనిపోతే ఎవరూ పట్టించుకోరేమో అంటూ ఎమోషనల్ గా ఒక ఫోటోని షేర్ చేశారు.


తనకు ఎన్నోసార్లు చనిపోవాలని ఆలోచన వచ్చిందని మానసిక ఒత్తిడి అనే సమస్య తనని ఎన్నో రోజులు వేధించింది దీని నుంచి బయటపడడానికి చాలా సమయమే తీసుకున్నాను అందుకు మనం కచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటూ తెలియజేశారు. ఒక్కసారి మనం సూసైడ్ చేసుకున్నాం అంటే ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు.. కేవలం కుటుంబం మాత్రమే బాధపడుతుంది ఎవరైనా సరే ఇలాంటి పని చేయకండి ఏదైనా సమస్యను ఎదుర్కొండి.. దేవుడు కష్టాలను పెడుతూనే ఉంటారు మనం వాటి నుంచి ఎలా బయటపడాలి అనేదే నేర్చుకోవాలని తెలిపారు షణ్ముఖ్. తనకు ఉన్న అనుభవాలలో అన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళుతున్నానని మీరు కూడా నాలాగా స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ షణ్ముఖ్ ఒక పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: