టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా, డాన్స్ మాస్టర్ గా పేరుపొందిన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఢీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తూనే అప్పుడప్పుడు పలు రకాల షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటారు. కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు అవుతున్న స్టార్ హీరోల చిత్రాలకు ఈ మధ్యకాలంలో కొరియోగ్రాఫర్ గా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కొందరైతే శేఖర్ మాస్టర్ ఫేవరెట్ డాన్స్ మాస్టర్ గా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అయితే శేఖర్ మాస్టర్ జీవితం స్టార్డం కేవలం రాత్రికి రాత్రి వచ్చింది కాదు.. దీని వెనుక ఎన్నో కష్టాలు అవమానాలు తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఉండేవట.. జూనియర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న శేఖర్ మాస్టర్ పలు వేదికల పైన ఎన్నోసార్లు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం తెలియజేశారు. గతంలో తనకి కేవలం 100 రూపాయలు ఇస్తే అది కోటి రూపాయలు దొరికినంత ఆనందాన్ని కలిగించేది అంటూ తెలిపారు. తన జీవితం మొత్తంలో డాన్స్ సినిమా తప్ప తనకి ఏమీ తెలియదని కూడా తెలిపారు.


ఎప్పుడూ కూడా అందరిని నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు శేఖర్ మాస్టర్ అయితే సినిమా రంగంలో ఉన్న వారి పైన ఎప్పుడూ కూడా పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కు అమ్మాయిలు పిచ్చి ఉందని చాలామందితో ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు కూడా వినిపించాయి.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ఈ విషయం పైన మాట్లాడుతూ.. బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని షో లలో తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని.. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ రాను రాను శేఖర్ మాస్టర్ కి అమ్మాయిల పిచ్చి అన్నట్లుగా మార్చేశారని తెలిపారు. అనసూయ, రష్మి లతో సరదాగా డాన్స్ చేస్తూ ఉంటే ముఖ్యంగా అక్కడున్న వాళ్లే ఈలలు కేకలు వేస్తూ ఉంటారని తెలిపారు. అనుకోకుండా ఒకసారి శ్రీముఖి డాన్స్ చేస్తున్నప్పుడు ముద్దు పెట్టిందని దీనిపైన కూడా పలు రకాల వార్తలు రాశారని తెలిపారు. ఇందులో తమ ప్రేమేయం లేకుండానే ఇలాంటివి వస్తూ ఉంటాయని ఆవేదన తెలియజేశారు శేఖర్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: