తెలుగు బుల్లితెరపై రియాల్టీ షోలలో బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. టిఆర్పి రేటింగ్ సైతం ఒక్కోసారి ఒక విధంగా మారుతూ ఉన్నది. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలు పెట్టడానికి ముందు ఎన్నో సందేహాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత బిగ్బాస్ క్రేజ్ వల్ల 7 సీజన్ల  వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా మొదలు కాబోతోందట. ఇందుకోసం చాలామంది నేటిజన్స్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పాలి అంటూ చాలామంది మా  స్టార్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు.


సీజన్ 8 మరో 50 రోజులలో మొదలు కాబోతోందనే వార్త ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ మొదటి వారంలో ఎనిమిదవ సీజన్ మొదలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందట.. ముఖ్యంగా ఆదివారం వచ్చేలా ఎపిసోడ్ని ప్లాన్ చేసినట్లు బుల్లి తెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాకముందే చాలా రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా కంట్రీస్టెంట్ల విషయంలో కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఇందులో యాంకర్ రీతు చౌదరి, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, వేణు స్వామి.. అలాగే ఒక సెలబ్రిటీ కపుల్ జంట కూడా ఇందులో సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా కొంతమంది యాంకర్స్ కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతోంది.మరి బిగ్ బాస్ తమ కంటిస్టెంట్ల లిస్టును సైతం ఎప్పుడు బయట పెడతారా అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. హోస్ట్ విషయానికి వస్తే మొదట ఎన్టీఆర్ ఆ తర్వాత నాని తీసుకువచ్చినప్పటికీ ప్రస్తుతం బిగ్బాస్ కి నాగార్జున హోస్టుగా చేస్తూ ఉన్నారు.. ఈసారి సీజన్ కి కూడా నాగార్జుననే హోస్టుగా కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: