మిగిలిన వారిని ఎంపిక చేసిన తరువాత కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ ను రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి సోషల్ మీడియా, టీవీ స్టార్స్ తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్ గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే శశిమధనం తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోనియా సింగ్ బిగ్ బాస్ లోకి కంటెంట్ గా అడుగు పెట్టనన్నట్లు ప్రచారం జరుగుతుంది. విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచిన యూట్యూబ్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8లో పాల్గొని అవకాశం ఉందని అంటున్నారు.
జబర్దస్త్ కామెడీ షో నుంచి ప్రతి సీజన్లో ఒకరు లేదండే ఇద్దరూ ఆర్టిస్టులు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా కనిపిస్తూ వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 లో మాత్రం జబర్దస్థ్ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్లో ఒకరు కచ్చితంగా బిగ్ బాస్ లో పాల్గొన్నట్లు సమాచారం. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఈ సీజన్లో జబర్దస్త్ నుంచి పొట్టి నరేష్, రియాజ్, కిర్రాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్ ల పేర్లు వినిపిస్తున్నాయి.