ముఖ్యంగా నటి జ్యోతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలె జ్యోతి అన్నట్లుగా తెలుస్తోంది. 9వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకున్నది. జ్యోతి రెడ్డి ఎక్కువ శాతం విలన్ పాత్రలోనే కనిపించేది. ఎక్కువ సమయాన్ని కుటుంబానికి ఇస్తూ ఉంటుంది. జ్యోతి రెడ్డి తల్లి తండ్రులు అలాగే కూడా భర్త, పిల్లలు పేర్లను కూడా తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నదట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే కొన్ని విషయాలను తెలిపింది..
మాజీ సీఎం భవనం వెంకటరామిరెడ్డి మనవరాలని చదువులో తానే ముందుండేదాన్ని డిగ్రీ ఎంఏ, ఎంఫిల్ వరకు చేశానని ముఖ్యంగా మూడుసార్లు గోల్డ్ మెడలు కూడా సంపాదించానని తెలియజేసింది. తనకి ఏదైనా ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది.. పెద్ద పెద్ద డైరెక్టర్లు వారి ప్రాజెక్టులలో నటించాలంటూ చాలామంది డైరెక్టర్లు పిఏలను తమ ఇంటికి పంపించేవారు.. కానీ ఒప్పుకోలేదని.. చివరికి తన తల్లి వల్లే యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటికీ నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నానని తెలిపింది. తనతో ఇప్పటివరకు నటించిన వారందరూ కూడా మంచి ఫ్రెండ్స్.. కేవలం వీరందరితో లొకేషన్ లో ఉన్నంతవరకే టచ్ లో ఉంటాను ఇంటికి వెళ్లిన తర్వాత పెద్దగా ఎవరిని పట్టించుకోనని తెలిపింది జ్యోతి రెడ్డి. ఈమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఈమెకు ఇద్దరు అబ్బాయిలని తెలిపింది.