ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఫోటోలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె కొడుకు జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అలాగే ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు కానీ ఇండస్ట్రీలో అతడు కూడా మంచి పాపులారిటీ అందుకున్నారట. దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్య నిపుణులట.
2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా కూడా గుర్తింపు పొందినట్లు సమాచారం అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ గా కూడా ఈయన ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం నటిగా తాను మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ తన భర్త వినిత్ గురించి ప్రేమి విశ్వనాథ్ చాలాసార్లు తెలియజేసింది. తన భర్త సహకారం లేకపోతే ఈరోజు తన కెరియర్ ఇలా ముందుకు సాగేది కాదు అంటూ కూడా వెల్లడించింది తెలుగులో కంటే మలయాళం లో ప్రేమి విశ్వనాథ్ ఎన్నో సీరియల్స్ లో నటించిన తెలుగులో కస్టడీ అనే చిత్రంలో కూడా కీలకమైన పాత్రలు నటించింది. కానీ బుల్లితెర పైన పాపులారిటీ సంపాదించుకున్న ఈమె వెండితెర పైన గెలవలేకపోయింది.