ఇదంతా ఇలా ఉండగా బిగ్ బాస్ -8; లో వీరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో పలు రకాల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా జబర్దస్త్ నటి రీతు చౌదరి, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్, నటి సురేఖ వాణి, కుమారి ఆంటీ తదితరులు హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరొక పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు ఆమె పేరు కుషిత కల్లాపు.. సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
అప్పట్లో టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఇమే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో కూడా నటించింది.. అయితే ఆ సన్నివేశాలని ఎడిటింగ్లో తీసేసారని తెలిపింది.. ఆ తర్వాత బాబు అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.. ప్రస్తుతం బిగ్ బాస్-8 సీజన్లోకి అడుగు పెట్టబోతున్నట్లు కుషిత కల్లాపు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కచ్చితంగా ఈమె క్రేజ్ మారుతుందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. మరి అభిమానులు కోరిక మేరకు ఈమెను హౌస్ లోకి తీసుకుంటారా లేదా అనే విషయం పైన త్వరలోనే క్లారిటీ రాబోతోంది.