ఇందులో భాగంగా తాను సినీ పరిశ్రమలో అక్కగా భావించేటువంటి ఒక సీనియర్ నటి తన గురించి సినీ పరిశ్రమలో చాలా చెడుగా ప్రచారం చేసేదని..కానీ తనకి సినిమా పరిశ్రమలో హీరోగా రాణిస్తున్న ఒక ప్రముఖ నటుడుతో ఎఫైర్ ఉందని లేనిపోని వార్తలను కూడా సృష్టించిందని ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని కూడా వెల్లడించింది. కానీ ఆమె అలాంటి తప్పుడు వార్తలు ఎందుకు తన గురించి తెలియజేసిందో తెలియడం లేదని కానీ ఆమె చేసిన పని తనకి ఎంత బాధ పెట్టిందో మాటల్లో తెలియజేయలేనంటూ తెలిపింది.
ఇలా చేయడం వల్ల ఆమెకు ఎలాంటి లాభం ఉందో తెలియదు.. కానీ తనకైతే ఇబ్బందులు పడ్డానని తెలిపింది. అలా నెమ్మదిగా అలాంటి వాళ్ళతో స్నేహం కూడా మానేశానని.. ఇక మీదట ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు తనమీద చేయకుండా ఉండేలా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ తెలియజేసింది. సమీర్ షరీఫా తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించడమే కాకుండా తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా సీరియల్స్ లో నటించింది నిర్మాతగా కూడా ఈమె కొన్ని సీరియల్స్ కి వ్యవహరించిందట. ఇక ఈమె అత్త సనా షరీఫ్ కూడా అటు బుల్లితెరపై వెండితెర పైన పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. సమీరా షరీఫా భర్త కూడా సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించారు అయితే మలయాళంలో పలు సీరియల్స్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారట.