తెలుగు బిగ్ బాస్ లో స్టార్స్, కమెడియన్స్ ఇలా చాలామంది బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా వెళ్లిన సంగతి తెలిసి. తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షోకు ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తో పాటు అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్ గా సీజన్లను సీజన్లు పూర్తి చేసుకుంటున్నాయి. తెలుగులో ఇప్పటికే ఏకంగా 7 సీజన్లో పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 8 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తొందరలోనే బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది.


అక్కినేని నాగార్జున ఓ వీడియో షేర్ చేసి బిగ్ బాస్ లోగోను రివిల్ చేశాడు. అయితే ఇందులో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కంటెస్టెంట్ గా నాలుగో బోతున్నారు అని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో..తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వేణు స్వామి బిగ్ బాస్ షో పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మీరు బిగ్ బాస్ షోకు వెళ్లారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కదా మీరు వెళ్తున్నారా అని యాంకర్ అడగ్గా.."నేను బిగ్ బాస్ షోకు వెళ్లటమా..అదొక చెత్త షో నేను వెళ్లను. అయితే ఇందులోకి వెళ్లి విన్నర్ గా నిలిచిన వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తారు.


సంవత్సరం పూర్తయ్యేసరికి మరో సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కొంత ప్రయోజనం కూడా లేదు. నాకు ఇప్పటికే బిగ్ బాస్ షోకు రమ్మని రెండుసార్లు ఆఫర్ వచ్చింది కానీ నేనే రిజెక్ట్ చేశాను. ఇక నేను ఆ షోలో ఎప్పటికీ అడుగు పెట్టను దానికి నేను పూర్తి వ్యతిరేకం. అక్కడికి వెళ్ల నేనేం చేశాను. ఆ బిగ్ బాస్ షోకు వెళ్లటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని నేనే అందరికీ చెప్పాను. అలాంటిది నేను ఆ షో కి వెళ్లడం ఏంటి" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: