టాలీవుడ్ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో పాటలు పాడిన ఇమే సమంతకు డబ్బింగ్ చెప్పడం వల్ల మరింత క్రేజ్ సంపాదించుకుంది. గత కొద్దిరోజుల నుంచి మీటు ఉద్యమం పైన కూడా పోరాడడంతో ఈమె పేరు మరింత పాపులర్ అవ్వడమే కాకుండా చాలామంది మీద ఈమె ఆరోపణలు కూడా చేసింది. అందుకే ఈమెను కోలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అక్కడ పాటలు పాడేందుకు డబ్బింగ్ చొప్పెందుకు కూడా ఈమెకు అనుమతి ఇవ్వలేదట. దీంతో చిన్మయి ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది.



సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఒక టీవీ షోలో భాగంగా అనసూయ ఒక చిన్న పిల్లాడు తో ప్రవర్తించిన తీరు పైన చిన్మయి ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ ఏది కదా ఒక పోస్టును కూడా షేర్ చేసింది.. అసలు విషయంలోకి వెళితే అనసూయ ఒక టీవీ షోలో ఉన్న పిల్లాడిని ఎత్తుకొని మరి తన మొహం మీద ముద్దులు పెట్టించుకుంటూ ఉంటుంది.. అయితే అలా చెంప మీద లిప్స్ మీద కిస్ పెట్టించుకున్న వీడియో కూడా వైరల్ గా మారుతున్నది


దీంతో ఈ వీడియో పైన చిన్మయి ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ అనసూయ పేరు పెట్టకుండా ఈమె ప్రవర్తించిన తీరు పైన కూడా ఫైర్ కావడం జరిగింది.. తల్లితండ్రులు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నప్పుడు ఒక టీవీ షోలో హోస్టుగా పిల్లవాడిని ఇలా నోటి పైన ముద్దు పెట్టమని అడగడం తాను చూసానని..ఇది చాలా భయంకరంగా అనిపించింది అంటూ చిన్మయి తెలియజేసింది. చిన్నపిల్లలకు నేర్పించాల్సిన బ్యాడ్  టచ్ గుడ్ టచ్ వంటివి చేయాలి కానీ ఇలాంటి పనులు దగ్గరుండి చేయించడం సరైన పద్ధతి కాదు అంటూ.. తెలియజేసింది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలనీ తెలియజేస్తోంది చిన్మయి.చిన్మయి వల్ల అనసూయ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: