
వాస్తవంగా చెప్పాలి అంటే రాజ్ తరుణ్ అంటే తనకు అసలు నచ్చదని కానీ తనతో ఎలా సినిమా చేశానో ఇప్పటికీ కూడా అర్థం కాలేదని.. టీవీలో కూడా అతను సినిమాలు కనిపిస్తే తీసేయమని చెప్పేదాన్ని అంటూ తెలిపింది. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ అని చెప్పి ఒక ఛానల్ కు పిలిపించారు.దాదాపుగా మూడు గంటలసేపు వెయిట్ చేసినా కూడా రాజ్ తరుణ్ ఆ ఇంటర్వ్యూకు రాలేదు. ఇలా రెండు గంటలపాటు వెయిట్ చేసిన రాలేదు.. అలా రాజ్ తరుణ్ వల్ల తనకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలియజేసింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు మొదటి అవకాశం రాజ్ తరుణ్ తో నటించే అవకాశమే వచ్చింది.. చేసేదేమీ లేక నటించాల్సి వచ్చింది.. అందుకే తన మధ్యలో కూర్చోవడం ఇష్టం లేక మధ్యలో డైరెక్టర్ ని కూర్చోబెట్టుకునే దాన్ని అంటూ తెలిపింది.. రాజ్ తరుణ్ తో సీన్ చేసేటప్పుడు కూడా తనకు ఎప్పుడెప్పుడు ఈ సీన్స్ అయిపోతాయాని ఎదురుచూసే దాన్ని అంటూ తెలిపింది.. చివరిగా ఒకరోజు కావాలని రాజ్ తరుణ్ కేవలం ఎనిమిది గంటల పాటు వెయిట్ చేయించాను అని చివరికి డైరెక్టర్ కూడా తనని ఆడుకోవడం మొదలుపెట్టారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.. దీన్ని బట్టి చూస్తే ఆరియానా, రాజ్ తరుణ్ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీగా కనిపిస్తోంది.