తెలుగు బుల్లి తెర పై అప్పుడే బిగ్ బాస్ సందడి మొదలవుతున్నది.. బిగ్ బాస్ -8 మొదలుపెట్టడానికి కూడా షో నిర్వాహకులు సిద్ధంగానే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా కంటెస్టెంట్ల లిస్టులో కూడా కొంతమంది నటీనటులు సీరియల్ యాక్టర్స్ గురించి పలు రకాల పేర్లు వినిపిస్తున్నాయి.. తాజాగా బిగ్ బాస్-8 లోకి గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన జ్యోతి రాయ్ హౌస్ లోకి ఎంట్రి ఇవ్వబోతుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.. అయితే ఇమే తెలుగులో కాకుండా కన్నడ సీజన్-11 లో అడుగుపెట్టబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం పైన జ్యోతి రాయి మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఇమే అంగీకరించలేదని స్వయంగా తెలియజేసింది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.. ముఖ్యంగా జగతి మేడమ్ పాత్రలో తన కట్టు బొట్టుతో సహజమైన నటనతో కూడా మెప్పించింది. చీర కట్టులో చాలా పెద్ద తరంగా తెలుగు ఆడియోస్ని కూడా బాగా ఆకట్టుకుంది. సినిమాలలో అవకాశాలు రావడంతో సీరియల్స్ లో తప్పుకొని పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తోంది



జ్యోతి రాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసు కొస్తూ కన్నడ బిగ్ బాస్ షోలో తాను పోటీ చేసే విషయం పైన చాలామంది అడుగుతున్నారని.. బిగ్బాస్ టీమ్ నుంచి కూడా తనకు ఆఫర్ వచ్చినప్పుడు దానిని చాలా గౌరవంగానే తాను తిరస్కరించాలని తెలిపింది. గతంలో తాను అంగీకరించినప్పటికీ కొన్ని కారణాల చేత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.ఈ అవకాశం కల్పించినందుకు తన అభిమానులకు కూడా తాను ఎప్పటికీ కృతజ్ఞురాలిని  తెలియజేసింది జ్యోతి రాయ్. ప్రస్తుతం జ్యోతిరావు షేర్ చేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: