తెలుగు బుల్లితెరపై టిఆర్పి రేటింగ్ పరంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ స్టార్ మా లో ఇప్పటికే సుమారుగా 1100 కు పైగా ఎపిసోడ్లతో పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఈ ధారావాహికలో రిషిదార జంటకు మంచి క్రేజ్ ఉన్నది. ఈ సీరియల్ నుంచి గడిచిన కొద్ది రోజుల క్రితం రిషి తప్పుకోవడంతో టిఆర్పి రేటింగ్ ఈ సీరియల్ కి పూర్తిగా పడిపోయిందట. దీంతో చివరికి మళ్ళీ రిషినే నటింపజేసేలా నిర్మాతలు తీసుకువచ్చారు. రిషి  రీ యంట్రి ఇవ్వడంతో మళ్లీ ఈ సీరియల్ కు రేటింగ్ బాగానే పెరిగినట్లు సమాచారం.



ఈ సీరియల్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక వారం వ్యవధిలోనే ఈ సీరియల్ కూడా ఎండింగ్ కి  చేరుతుందట. అయితే ఇంత అర్జెంటుగా ఈ సీరియల్ క్లోజ్ చేయడానికి ముఖ్య కారణం బిగ్ బాస్ షోనే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ షో కార్యక్రమం త్వరలో తెలుగులో  8 వ  సీజన్ కాగా కన్నడలో 11వ  సీజన్ కూడా ప్రసారం కాబోతున్నది.. ఈ కార్యక్రమంలోనే సీరియల్ హీరో రిషి కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే వసుధార కూడా తెలుగు బిగ్ బాస్ -8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలియగానే అభిమానులు కాస్త ఆనందపడుతున్నప్పటికీ సీరియల్ త్వరగా అయిపోతుందా అని బాధలో కూడా ఉన్నారు. అభిమానులు సైతం వీరిద్దరూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తే కనుక ఖచ్చితంగా వీరికి సపోర్ట్ ఎక్కువగానే ఉంటుందని తెలియజేస్తున్నారు.తెలుగులో రక్ష గౌడ్ కి మంచిది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. దీంతో  అభిమానులు కూడా ఈమెకే సపోర్టు చేస్తున్నారు. మరి ఈ వార్తల పైన ఈ జంట ఎంతవరకు స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: