చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత క్రేజ్ తో అవకాశాలను సంపాదించుకుంటూ ఉంటారు.  హౌస్ లో మంచి పాపులారిటీ సంపాదించుకొని సినిమాలలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఈమె కూడా ఒకరు..ఆమె ఎవరో కాదు ఇనయా సుల్తానా. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసింది. అందం అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది



గతంలో వర్మ ఇంటర్వ్యూ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇనాయ సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని భారీ క్రేజ్ అందుకుంది. ఆర్జీవి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయడం వల్లే ఈమెను హౌస్ లోకి తీసుకున్నారు అని ఆయన సపోర్టు కూడా ఉందని చాలామంది భావించారు. ఆ తర్వాత హౌస్ లో తన ఆటతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ విన్నర్ కాలేక పోయింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు వస్తాయని ఆశ పడినప్పటికీ అందుకు తగ్గట్టుగా అవకాశాలైతే రాలేదు. కాని సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా ఇనాయ సుల్తానా షేర్ చేసిన ఈ వీడియో విషయానికి వస్తే.. చాలా అందంగా కనిపిస్తు.. తన అంద చందాలతో బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాన్స్ చేస్తూ ఉండడంతో అభిమానులు ఆశ్చర్యపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు.. ఇనాయ సుల్తానా ఏంటి ఇలా రెచ్చిపోతోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇనాయ సుల్తాన్ హాట్ లుక్ లో అందరిని ఫిదా చేస్తోంది అంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్నారు. బ్లాక్ కలర్ దుస్తులలో ఇనాయ సుల్తానా ఫుల్ కిక్కించేలా ఉందంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: