తెలుగు బిగ్ బాస్ -8 వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు 7 సీజన్లను విజయవంతంగా చేసుకున్న బిగ్ బాస్.. రాబోయే సీజన్ కి కంటిస్టెంట్ల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ఎంతో మంది కంటెస్టెంట్ల పేర్లు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ షో నుంచి తప్పుకునే వారు చాలా మంది ఉన్నారని ప్రచారం కూడా జరుగుతున్నది. అదే సమయంలో ఎవరు ఊహించని కంటెస్టెంట్లను సైతం బిగ్ బాస్ ఇందులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా మరో కంటెంట్ ఆర్జే శేఖర్ భాష కన్ఫామ్ అయినట్లుగా సమాచారం.


రాజ్ తరుణ్ స్నేహితుడే ఆర్జే శేఖర్ భాష కావడం వల్ల  తనకి అవకాశం కల్పించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈనెల 28న ఏవి షూట్ చేయబోతున్నారని ఇతనికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారంలో శేఖర్ భాష పేరు బాగానే పాపులర్ అయ్యింది. అయితే అంతకంటే ముందే శేఖర్ భాష కొన్ని చానల్స్ లో యాంకర్ గా కూడా పనిచేసినట్లు సమాచారం. రాజ్ తరుణ్ విషయం పైన ఎన్నో రకాల ఇంటర్వ్యూలు ఇచ్చి నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నారు శేఖర్ భాష.


ఇక శేఖర్ భాషతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ, ఆదిత్య ఓం , ఆలీ తమ్ముడు, యస్మి గౌడ, అభిరామ్ వర్మ రీతూ చౌదరి తదితర పేర్లు సైతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వీరందరూ కూడా తమకు సంబంధించిన వాటి గురించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ విషయం పైన బిగ్ బాస్ టీమ్ కూడా ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ విషయం పైన శేఖర్ భాష కూడా క్లారిటీ ఇస్తారమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: