చాలా మంది సెలబ్రెటీలు మొదట మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత.. ఏదో ఒక రూపంలో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. అలా ఈ మధ్యకాలంలో చాలామంది సెకండ్ డేస్ మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ లలో కూడా పలు రకాల సినిమాలు వెబ్ సిరీస్ లో అందుబాటులోకి రావడంతో సీనియర్ నటీనటులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షోలకు కూడా స్పెషల్ ప్రోగ్రాములు గా జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలా గతంలో బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో శివాజీ బుల్లితెర పైన ఎంట్రీగా పోతున్నట్లు సమాచారం.


మొదట కొన్ని చానల్స్ లో ఎడిటర్ గా కూడా పని చేశారట. ఆ తర్వాత సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్లలో, సహాయ పాత్రలలో కూడా నటించి హీరోగా ఎదిగి పేరు సంపాదించారు శివాజీ. తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించారు. ఎప్పుడైతే పొలిటికల్ లోకి అనవసరంగా ఎంట్రీ ఇచ్చారు అప్పుడే తన కెరియర్ నాశనం అయ్యింది.. చివరికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి గత సీజన్తో మంచి పాపులారిటీ అందుకున్నారు.


బిగ్బాస్ ద్వారా ఫేమ్ రావడంతో సినిమాలలో అవకాశాలు వస్తూనే బుల్లితెర పైన జడ్జిగా రాబోతున్నారట. వినాయక చవితి పర్వదినాన సందర్భంగా ఈటీవీలో జై జై గణేశా అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ని చేయబోతున్నారట. ఇందులో అలనాటి హీరోయిన్ ఖుష్బూ, ఇంద్రజ తో పాటుగా శివాజి కూడ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ఇంద్రజ నీ పొగిడేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ మహారాణి అంటూ తెలిపారు.. అలాగే ఖుష్బూను బిగ్ బాస్ మహారాణిగా పిలిచారు. రష్మీ విషయానికి వస్తే రష్మీ త్వరలోనే పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ తెలిపారు. ఆ తర్వాత రష్మీ మా ముగ్గురిని పిలిచి మీరు లేటుగా ఎందుకు వచ్చారు అంటూ రష్మీ అడిగినప్పటికీ తాను లేటుగా రాలేదని టైం వచ్చింది వచ్చాను అంటూ ఒక డైలాగ్ తో శివాజీ నవ్వించారు.. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే ఒక ప్రోగ్రాంలు కూడా తాను జడ్జిగా రాబోతున్నానని చెప్పడంతో.. కుష్బూ, ఇంద్రజ తమ పోస్టులకు విసరి పెడతారేమో అంటూ కాస్త షాక్ అయినప్పటికీ.. రష్మీ మాత్రం జడ్జిగానే కదా తన సేఫ్ అన్నట్టుగా తెలిపింది.. అయితే శివాజీ యాంకర్ గాన లేకపోతే జడ్జి గానా అని చెబుతూ ఉండగా కట్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: