బుల్లితెర పైన ఎప్పుడూ కూడా వివాదాస్పదకరంగా మారేటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కూడ ఒకటీ.ప్రతి సీజన్కు ఇది జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా టిఆర్పి రేటింగ్ కూడా భారీగానే వస్తూ ఉంటుంది. బిగ్ బాస్ -18 హిందీ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే ఎప్పటిలాగానే హోస్టుగా సల్మాన్ ఖాన్ వస్తారనే విధంగా వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ -18 షో కి సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ విషయంపై మరొకసారి అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.



అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బాస్ -18 సీజన్  ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కి సంబంధించి ప్రోమోని షూట్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్టుగా చేయడం వల్ల టిఆర్పి రేటింగ్ కూడా భారీగానే వస్తుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.అందుకే హోస్టుగా ఇతరుల కోసం బిగ్ బాస్ సంస్థ ప్రయత్నించిన తిరిగి మళ్లీ సల్మాన్ ఖాన్ ని తీసుకున్నట్లు సమాచారం.


అయితే ఈసారి సీజన్ మరింత రెట్టింపు ఉత్సాహంతో రాబోతొందట. బిగ్ బాస్ -18 లో చాలామంది కంటెస్టెంట్ల గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ పారితోషకం పెంచారనే విధంగా బాలీవుడ్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. గత సీజన్ కి 12 కోట్లు తీసుకోగా.. ఈ రకంగా ఒక్కో ఎపిసోడ్ కు ఆరు కోట్ల రూపాయలు నిర్మాతలు చెల్లించారట. దీని ప్రకారం చూస్తే బిగ్ బాస్ -17 సీజన్ పూర్తి అయ్యేసరికి 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ముట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ -18 షో కి సల్మాన్ కా ఏకంగా 75 కోట్ల రూపాయల వరకు పెంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: