సీరియల్ ఆర్టిస్టులకు సినిమా ఆర్టిస్టులకు పెద్దగా తేడా ఉండవు ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉంటే చాలు అక్కడ నటిస్తూ ఉంటారు.. కొంతమంది మాత్రం తమ కెరియర్ లో కొన్ని రూల్స్ పెట్టుకొని కేవలం సినిమాలకు సీరియల్స్ కి పరిమితం అవుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం స్టార్ పొజిషన్లో ఉన్నప్పుడు సినిమాలు చేసి ఆ తర్వాత సీరియల్స్ వైపు అడుగు వేస్తున్నారు. ఇప్పటికే అలా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అడుగులు వేయడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఒక హీరోయిన్ తల్లి కూడా బుల్లితెర నటి అన్నట్లుగా తెలుస్తోంది.ఆమె ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



బ్రహ్మముడి సీరియల్ లో శాడిస్ట్ అత్తగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీప్రియ బాగ సుపరిచితమే.. ఈమె సీరియల్ లో అపర్ణ క్యారెక్టర్ లో నటిస్తోందట ఈ సీరియల్ సే కాకుండా ఈమె మొగలిరేకులు సీరియల్స్ లో కూడా నటించింది. కానీ శ్రీప్రియ పాపులర్ అయిన అంతగా ఈమె కూతురు చరిష్మా పెద్దగా పాపులారిటీ సంపాదించు కోలేకపోయింది. చరిష్మా కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది..అలా నీతోనే హాయ్ హాయ్, ఆర్ యు మ్యారీడ్, రుద్రాంగి  అనే చిత్రాలలో హీరోయిన్గా నటించిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఈమె కనిపించలేదట.


శ్రీప్రియ మాత్రం బుల్లితెర పైన వరుస సీరియల్స్ తో బిజీగా దూసుకుపోతోంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు శ్రీ ప్రియ తెలిసినంతగా ఆమె కూతురు చరిష్మా గురించి తెలియకపోవచ్చు.. శ్రీ ప్రియ మాత్రం సీరియల్స్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నది..మరి చరిష్మా కు రాబోయే రోజుల్లో ఏవైనా మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.. మొత్తానికి  తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఒకరు సీరియల్స్ లో మరొకరు వెండితెర పైన రాణిస్తూ బాగానే నెట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: