తెలుగు బుల్లితెరపై సత్తా  చాటినటువంటి యాంకర్స్ చాలామందే ఉన్నారు.. అందులో శిల్పా చక్రవర్తి కూడా ఒకరు.. ఈమె హైదరాబాదులోని తనదైన స్టైల్ లో యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. అంతేకాకుండా గతంలో ఎన్నో షోలకు హోస్టుగా కూడా వ్యవహరించింది. పలు చిత్రాలలో కూడా శిల్ప చక్రవర్తి నటించింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగి అయినప్పటికీ కూడా హైదరాబాదులోనే స్థిరపడి ఇక్కడే  స్కూల్, కాలేజీ చదువునంతా కూడా పూర్తి చేసిందట. మొదట మోడల్ గా తన కెరీయర్ని ప్రారంభించిన ఈమె బుల్లితెర పైన వావ్ ది అల్టిమేట్ గేమ్ షో అని షో కి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత కంటే కూతుర్నే కనాలి అనే సీరియల్ లో నటించి పాపులారిటీ సంపాదించుకున్న ఈ యాంకర్ డ్యాన్స్ షో కి పలు రకాల టీవీ షోలకు కూడా హోస్టుగా వ్యవహరించింది శిల్పా చక్రవర్తి. తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా పేరు సంపాదించిన ఈమె.. కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత తన బాధ్యతలను భుజాన వేసుకోవడంతో అటు యాంకరింగ్ కి పుల్ స్టాప్ పెట్టేసింది.


2019లో బిగ్ బాస్ -3 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మాత్రం ఎక్కడ కనిపించడం లేదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న శిల్పా చౌదరి తాజా ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  వామ్మో శిల్పా శెట్టి ఇలా ఉందేంటి.. అప్పటికి ఇప్పటికీ ఇదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు  టూ హాట్ గా తయారయ్యిందని.. ఏదైనా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట్రై చేయొచ్చు అంటూ పలువురు నెటిజెన్స్ ఈమె ఫోటోలను చూసి కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: