తెలుగు బుల్లితెర ,వెండితెర పైన కొంత మంది నటీనటులు నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎలాంటి పాత్రలోనైనా నటిస్తూ ఉంటారు. అయితే కొంత మంది వారు నటించిన సీరియల్స్ లేదా చిత్రాలలోని పాత్రల కారణంగా వారి యొక్క కెరియర్ మలుపు తిరగడం లేదా ముగిసిపోవడం వంటివి జరిగిన సందర్భాలు చాలా మంది సెలబ్రిటీలకు ఉన్నాయి. అలా పలు తెలుగు సీరియల్స్ లో నటించి సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలలో నటించిన నటి వహీదా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే మారిపోయింది.



నటి వహీదా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా బోల్డ్ మరియు వ్యాంపు తరహా పాత్రలలో కూడా నటించినది.. నటిగా ఎంతో పేరు సంపాదించుకున్న వహీదా తాను ఎంచుకున్న  చిత్రాల్లోని పాత్రల వల్లే తనకు అవకాశాలు రాలేకపోతున్నాయంటూ తెలియజేస్తోంది. తనకంటూ చెప్పుకోవడానికి ఏదైనా సరైన హిట్ సినిమా, సీరియల్ కానీ లేదంటు తెలియజేస్తోంది. గతంలో బి గ్రేడ్ మూవీలలో నటించిన అవి తన కెరీర్ కు ఏ విధంగా ఉపయోగపడలేదని దీనివల్ల ఎక్కువగా సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలు కూడా తగ్గిపోయాయని వెల్లడించింది. ప్రస్తుతం తన చేతిలో ఎలాంటి అవకాశాలు లేవంటూ వెల్లడించారు.


అప్పుడప్పుడు పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కనిపించిన ప్రేక్షకులు గుర్తుపట్టలేదని తెలియజేస్తోంది. అన్ని భాషలలో కలుపుకొని సుమారుగా 50 కి పైగా చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వహీదా. వహీదా నటించిన చిత్రాలలో తకిట తకిట, ఓ రాధ కథ, కాలభైరవ, అనాగరికం, కౌసల్య ఆంటీ వంటి చిత్రాలలో పరవాలేదు అనిపించుకుంది వహీదా. వహీదా బుల్లితెర పైన ఆకట్టుకున్నప్పటికీ.. ఈ గ్రేడ్ చిత్రాల వల్ల ఈమెకు అవకాశాలు రాకుండా తన సిని కెరియర్ నాశనం అయ్యిందని సమాచారం. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ బుల్లితెర నటికి సినిమాలలో కానీ సీరియస్ లో గాని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: