ఉదయ్ కిరణ్ టాలెంటెడ్ ,సక్సెస్ ఫుల్ ఉన్న హీరో అని అయితే సక్సెస్ లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఫెయిల్యూర్ లోకి రావడంతో ఆ సుచివేషన్ ని ఆయన తట్టుకోలేకపోయారని అయితే దాదాపు తనకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందిని కానీ తాను హీరో గానే కాకుండా రైటర్ గా ఉండడంతో అటువైపుగా వెళ్లిపోయారని వెల్లడించారు.. సినీ ఇండస్ట్రీలో హీరోగా ముందుకు వెళ్లడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగితేనే జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు ఆదిత్య ఓం.
హీరోగా చేస్తే కేవలం ఇండస్ట్రీలో హీరో గానే కొనసాగాలి ఒకవేళ అవకాశాలు రాక సినిమాలు చేయకపోతే ఎందుకు చేయలేదంటూరూ ..?ఒకవేళ సినిమాలు ఫ్లాపులు అయితే ఎందుకు సక్సెస్ కాలేదని అడుగుతారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటే వారి యొక్క మెంటల్ హెల్త్ బాగుండాలి అని వెల్లడించారు. ఇలాంటి పరిణామాలు అన్నీ కూడా ఉదయ్ కిరణ్ తట్టుకోలేకపోవడంతోనే ఇలా చేసి ఉన్నారని అలాగే తనతో పాటు రెండు మూడు చిత్రాలలో నటించిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసుకున్నారంటూ తెలిపారు ఆదిత్య ఓం. ఇక పొలిటికల్ గురించి తాను ఏమి చెప్పలేనని తమకైతే బిగ్ బాస్ వంటి ఒక ప్లాట్ ఫామ్ మరొకసారి తమని నిరూపించుకోవడానికి దొరికింది అనే విధంగా తెలియజేశారు ఆదిత్య ఓం.