ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ -8 లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. ఇందులో హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, మెహబూబ్, ముక్కు అవినాష్, గంగవ్వ, టేస్టీ తేజ ఉన్నారు. వీరు హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నాన హంగామా చేస్తూ రచ్చ చేస్తూ ఉన్నారు. బిగ్బాస్ కి పాజిటివ్ వైస్ తీసుకువచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా ముక్కు అవినాష్ రోహిణి చేస్తున్న పర్ఫామెన్స్ కి కడుపుబ్బనవ్వలేకపోతున్నారట ప్రేక్షకులు.


గతవారం వీరిద్దరూ ఫన్నీ టాస్క్ కింద చేసిన టాస్క్ అందరిని మెప్పించడమే కాకుండా రేటింగ్ పరంగా కూడా కాస్త పెరిగినట్టుగా అనిపించిందట. జబర్దస్త్ షోలో అవినాష్, రోహిణి తమ కామెడీతో బాగానే ఆకట్టుకున్నారు. అలా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా మరొకసారి అందరిని ఆకట్టుకునే అవకాశం లభించింది. ముఖ్యంగా రోహిణికి సినిమా అవకాశాలు చాలానే వస్తూ ఉన్నప్పటికీ బిగ్ బాస్ షోకి వైల్డ్ కార్డు  ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ముక్కు అవినాష్ గతంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమెంట్ అయిన తర్వాత అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు


ఆ తర్వాత తన భార్యతో కలిసి ఎన్నో వీడియోలు చేసిన ముక్కు అవినాష్. ఇప్పుడు మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ -8 లో అడుగుపెట్టిన ముక్కు అవినాష్ రోహిణి తో కలిసి చేసిన రొమాంటిక్ ఫన్నీ టాస్క్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రోహిణి, ముక్కు అవినాష్  బిగ్బాస్ భార్యాభర్త  స్కిట్ చేయమని అడగగా.. బిగ్బాస్ గొంతుతో ముక్కు అవినాష్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. రోహిణి ఫన్నీ కామెంట్స్ తో అందరిని నవ్వించడమే కాకుండా ముక్కు అవినాష్ని నువ్వు నా మొగుడికి రా నాయన అంటూ అక్కడున్న వారందరిని నవ్విస్తోంది. ఎలా ఉన్నావని ముక్కు అవినాష్ అడగగా రోహిణి నన్ను చూస్తే ఇంట్లో తెలుస్తుంది.. ఎలా ఉన్నానంటే ఏం చెబుతాను రా అంటూ రోహిణి మాట్లాడుతుంది. ముఖ్యంగా రోహిణీ తో కలిసి చేసినటువంటి ఈ ఫన్నీ స్కిట్ రొమాంటిక్ యాంగిల్ లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా రోహిణి , అవినాష్ మధ్య ఘాటైన రొమాంటిక్ ఫన్నీ స్కిట్ ఇదని చెప్పవచ్చు.దీంతో ఆడియన్స్ కూడా ముక్కు అవినాష్ భార్యతో కాకుండా రోహిణి తో ఇలా చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: