తెలుగు బుల్లితెరపై కామెడీ షోలలో కనిపిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ పొట్టి నరేష్ కూడా ఒకరు.. తన కామెడీ స్కిట్లతో బాగా పాపులర్ అయిన నరేష్ తన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటారు. ఎక్కువగా బుల్లెట్ భాస్కర్ చేసేటువంటి స్కిట్లు చేస్తూ ఉండేవారు పొట్టి నరేష్.. అయితే పొట్టి నరేష్ చూడడానికి పొట్టిగా ఉన్నప్పటికీ ఈయన వయసు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇవే కాకుండా నరేష్ గురించి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం.


నరేష్ వయసు గూగుల్ లో తెలిపిన సమాచారం ప్రకారం 25 సంవత్సరాలట.. ఇటీవలే నరేష్ గురించి ఒక ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. తన టీం లో నరేష్ చాలా చలాకిగా ఉంటారని ఎలాంటి విషయాలు చెప్పిన ఇట్టే గ్రహించేస్తారని తెలిపారు. ఒకసారి స్కిట్లు కేవలం ఒకసారి మాత్రమే స్క్రిప్ట్ ని చదివి గుర్తు పెట్టుకుంటారని అలాగే యాక్ట్ చేస్తారని కూడా తెలిపారు. నరేష్ తెలంగాణ ప్రాంతమునకు చెందిన అబ్బాయి అని తెలిపారు. అయితే నరేష్ తన హైట్ తక్కువగా ఉండటంవల్ల జబర్దస్త్ లో బాగా క్లిక్ అయ్యానని కూడా తెలిపారు.



నరేష్ కమెడియన్ గా కంటే ముందుగా తన డాన్స్ అంటే చాలా ఇష్టమని అలా ఢీ షో కి కూడా మొదట సెలెక్ట్ అయ్యారట. ఆ సమయంలోనే ఒక జబర్దస్త్ కమెడియన్ నరేష్ను చూసి జబర్దస్త్ లోకి తీసుకువచ్చారట. అలా మొదటిసారి చలాకి చంటి టీమ్ లో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులకే బుల్లెట్ భాస్కర్ థీమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన కామెడీతో బాగా ఆకట్టుకున్న నరేష్ తనకు ఎదుగుదల లోపం అనే వ్యాధి ఉన్నదట. అయితే ఇది పూర్తిగా బాగు చేయించుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయట. కానీ ఇలా చేయించుకోవడం కూడా  ప్రాణాలు మీదకు రిస్క్ అని నరేష్ అలాగే ఉండిపోయారట. మొత్తానికి నరేష్ తనకు ఉన్న లోపం వల్లే బాగా సంపాదించి తన సొంత ఊర్లో ఇళ్లతో పాటు స్థలాలు కూడా కొంటున్నారనీ సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: