అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిన అమ్మాయి ఎవరు అంటూ పలువురు అభిమానులు గూగుల్లో సర్చింగ్ చేయగా పలు రకాల ఫోటోలు విషయాలు బయటపడ్డాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిన అమ్మాయి బుల్లితెరపై చాలా ఫేమస్ అయిన నటినట. ఆమె ఎవరో కాదు చైత్ర రాయ్.. ఈమె తెలుగు కన్నడలో కూడా పలు రకాల సీరియల్స్ లో నటించిందట. అలా క్రేజ్ తోనే బుల్లితెరకు గుడ్ బై చెప్పి సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చింది.
అష్ట చమ్మ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన చైత్ర రాయ్ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. కన్నడలో మొదటిసారి తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన చైత్ర రాయ్ సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. చాలాకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈమె గురించి ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె ఫోటోలు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అయితే ఈమెకు వివాహమై పిల్లలు కూడా ఉన్నట్లు పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.