అయితే మణికంఠ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకునే వారు కాదు ఖచ్చితంగా హౌస్ లో ఉంటే టాప్ త్రీ వరకైనా వెళ్లేవారని తెలియజేస్తూ ఉంటారు. బిగ్బాస్ హౌస్ లోకి వచ్చే ముందు నాగ మణికంఠ ఎవరికి తెలియకపోయినా హౌస్ లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా సంపాదించుకున్నారు. చాలామంది హౌస్ నుంచి నాగమణికంఠ బయటికి రావడంతో ఇంటర్వ్యూ కోసం పలు రకాల యూట్యూబ్ చానల్స్ కూడా క్యూ కడుతున్నాయి. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం చాలామంది ఎలా చూశారో ఇప్పుడు నాగమణికంఠ ఇంటర్వ్యూ కోసం అలా ఎదురుచూస్తున్నారట.
అయితే నాగమణికంఠ కూడా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూనే ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారట. తాజాగా ఇప్పుడు నాగ మణికంఠకు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం త్వరలోనే స్టార్ మా చానల్స్ లో మొదలయ్యే సీరియల్లో హీరోగా నటించే అవకాశం సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా కొన్ని రకాల సీరియల్స్ లో నటించిన నాగమణికంఠ గుర్తింపు రాలేదు కానీ హౌస్ లో నుంచి బయటికి వచ్చి హీరోగా నటించే అవకాశం రావడంతో కచ్చితంగా నాగమణికంఠ కెరియర్ మలుపు తిరుగుతుందనే విధంగా అభిమానులు నమ్ముతున్నారు. ఇవే కాకుండా పలు రకాల షోలలో కూడా కనిపించేలా అవకాశాలు వస్తున్నాయట.