బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకులకు అసలు విష్ణు ప్రియ హౌస్ లోకి వచ్చింది పృథ్వీ కోసమా లేకపోతే బిగ్బాస్ విన్నర్ అవ్వడం కోసం అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో చాలామంది ఈమెకు ఓటు వేయడం కూడా ఆపేశారట. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు టైటిల్ రేసులో ఉన్న విష్ణు ప్రియ ఇప్పుడు టాప్ ఫైవ్ లో కూడా రావడం కష్టమనే పరిస్థితి ఏర్పడింది.. ఇదంతా ఇలా ఉంటే యాష్మి, పృథ్వీ కి ఒక్కసారిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.. అసలు మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్ ఉండడం చూసి తనకే మీ మధ్య ఏదో ఉందనిపిస్తోంది ఇక బయట వాళ్లకు ఎలా అనిపిస్తుందో అంటూ ప్రశ్నించింది.
అయితే ఈ విషయం పైన పృథ్వీఅలాంటిదేమీ లేదు అంటూ తెలియజేశారు హౌస్ లో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా ఆమెతో ఎందుకు ఎక్కువగా ఉంటున్నావ్ అంటూ యాష్మీ ప్రశ్నించింది.. దీంతో పృథ్వి ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తోంది అంటూ తెలిపారు నేను ఆమె దగ్గరికి వెళ్లడం చాలా తక్కువ అంటూ పృద్వి వెల్లడించారు. దీంతో పృథ్వీ,విష్ణు ప్రియ దగ్గరికి వెళ్లి ఈ విషయం పైన క్లారిటీగా చెప్పేశారు.. హౌస్ లో తాను ఎవరితో కూడా రిలేషన్లో ఉండనని తాను సింగల్ గా ఉండడానికి ఇష్టపడతానని తన మీద ఏదైనా ఫీలింగ్ ఉన్నాయా అని విష్ణు ప్రియ అని అడగగా.. విష్ణు ప్రియ ఇలా మాట్లాడుతూ.. నా మీద నీకు ఎలా అనిపిస్తోంది నువ్వు నన్ను చూస్తున్నావు కదా అని అడగగా.. దీనికి పృథ్వీ నాకు అలానే అనిపిస్తుంది.. మనిద్దరం కేవలం స్నేహితులుగానే ఉందాము నాకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటూ.. ఒకవేళ నీకు ఉంటే ఇప్పుడే వాటిని ఆపివేయడం బెటర్ అంటూ పృథ్వి ముఖం మీద చెప్పేశారు. దీంతో విష్ణు ప్రియ ఒకసారిగా ఫీల్ అవుతూ బెడ్ రూమ్ కి వెళ్లి మరి ఎమోషనల్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఈ విషయం విన్న అభిమానులు .. విష్ణు ప్రియ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.