ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలోని మహిళలకు సైతం వేధింపులు తప్పడం లేదని ప్రతి ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపుల గురించి చాలామంది ఇప్పటికి సెలబ్రిటీలు తెలియజేశారు. ముఖ్యంగా చాలామంది తమకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి క్యాస్టింగ్ కావచ్చు గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా చిన్నారి పెళ్లికూతురుగా పేరుపొందిన ఆవికా గొర్ కూడా తన జీవితంలో తనకు ఎదురైన ఒక వేధింపులకు సంఘటనను తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.


తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆవికా గోర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మరింత పాపులారిటీ  సంపాదించింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ఈమె రెమ్యూనరేషన్ పెంచడమే అన్నట్లుగా సమాచారం. ఇలా అయితే అవకాశాలు రావని చేసిన తప్పులను తెలుసుకొని వచ్చిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆవికా గోర్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి తెలియజేసింది.


ఫ్యాన్స్ నుంచి తనని కాపాడుకోవడానికి ఒక వ్యక్తిని తాను బాడి గార్డ్ గా ఉద్యోగం ఇచ్చానని కానీ అతడు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక సినిమా ఈవెంట్లో చాలా దారుణంగా తనని తాకాడు అంటూ తెలిపింది. అయితే అలా తను రెండుసార్లు తనతో అలా అసభ్యకరంగా ప్రవర్తించాడని.. ఈ విషయం పైన తాను ఫైర్ ఏంటి అని అడగగానే వెంటనే తనకు సారీ అని చెప్పి వెళ్లిపోయాడని తెలిపింది ఆవికా గోర్.. అయితే ఆ తర్వాతే కొద్ది రోజులకి తనని తీసేసానని తెలిపింది. అయితే ఆ సమయంలో ఆ బాడీ గార్డ్ ని కొట్టే ధైర్యం తనకు లేదని కానీ ఇప్పుడు అలా కాదు అలా ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిని కొట్టగలిగే ధైర్యం వచ్చింది అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: