బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీగా పేరుపొందిన వారిలో కపిల్ శర్మ కూడా ఒకరు.. ఈయన టీవీ పరిశ్రమలోనే ఎక్కువగా ప్రజా దారుణ పొందిన షో
లలో ఎన్నో ఏళ్లుగా పేరుపొందింది పైగా టీవీలో కామెడీ షో హోస్టుగా చేస్తూ ప్రేక్షకులకు  బాగా దగ్గరయ్యారు కపిల్ శర్మ. అయితే గతంలో కూడా కపిల్ శర్మ స్టాండప్ కమెడియన్ గా చేశారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడుగా కూడా పేరు సంపాదించారు. కానీ కేవలం బుల్లితెరను వదిలి ఒక తప్పు చేయడం వల్ల కోట్ల రూపాయలను నష్టపోయాడట వాటి గురించి చూద్దాం.


కపిల్ శర్మ సినిమాలలోకి వెళ్లి కోట్ల రూపాయలను పోగొట్టుకున్నట్లు సమాచారం.. ఫీల్ ఇట్ ఇన్ యువర్ సోల్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ లో పాల్గొన్న కపిల్ శర్మ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను వివరించారు. అలాగే తన జీవితంలో కొన్ని పాత రోజులను గుర్తు చేసుకోవడం జరిగిందట. మొదట తను 1200 రూపాయలు జేబులో పెట్టుకొని ముంబైలో అడుగు పెట్టానని కొన్ని రోజులపాటు తాను ఒక పూట కూడా తినడానికి చాలా ఇబ్బందులు పడ్డాను.. అలాంటి సమయంలోనే తనకు కపిల్ శర్మ షో ద్వారానే తెలిపారు. దీంతో తనకు చాలా డబ్బు వచ్చిందని.. ఆ డబ్బుతోనే నిర్మాతగా మారొచ్చు అనుకోని రెండు చిత్రాలను చేశాను అయితే డబ్బులు ఉంటే నిర్మాతలు కాలేరని ఆ తర్వాతే అర్థమయిందని తెలిపారు.


నిర్మాతలుగా మారాలి అంటే చాలా ఆలోచనతో పాటు తెలివి ఉండాలని తెలిపారు. అలా తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని పెట్టి సినిమాలు చేశాను కానీ ఏ ఒక్క సినిమాలు కూడా సక్సెస్ కాలేదు. ఒక్కసారిగా తన బ్యాంక్ అకౌంట్ మొత్తం జీరో అయిపోయిందని తెలిపారు. దీంతో చాలా డిప్రెషన్ కి వెళ్ళాను అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి.. అలాగే తన భార్య చేసిన సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. చాలా విషయాలు తనని డిప్రెషన్ కి గురి చేశాయని. ఇప్పుడిప్పుడే మళ్ళీ సరైన దారిలోకి వచ్చాను అంటూ తెలిపారు. ఈయన ఆస్తి 300 కోట్లకు పైగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: