నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షోను బాలకృష్ణ తన ఎనర్జీతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు ఎంతో మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. ఇక ఇప్పుడు సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూశారు. ఇక తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరు కావడంతో అన్ స్టాపబుల్ షోకి విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా సీజన్ 4 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్  మొదలయ్యింది.మరోసారి బాలకృష్ణ తన ఎనర్జీతో హోస్ట్ గా ఆకట్టుకున్నారు. ఎక్కడ తగ్గని ఎనర్జీతో సీజన్ 4ను షురూ చేశారు బాలయ్య. ఇక తన ఎనర్జీతో గెస్ట్ లుగా వచ్చిన వారిని తికమక పెట్టె బాలకృష్ణ బాబు గారిని కూడా అలాంటి ప్రశాలతో ముంచెత్తారు. ఆ ప్రశ్నలకు చంద్రబాబు చాలా తెలివిగా సమాదానాలు చెప్పారు. షో స్టార్టింగ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఓత్  అంటూ ఓ బుక్ పై చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నారు. 

ఈ షోలో తాను అడిగే ప్రశాలకు బాలకృష్ణ పై ప్రేమతో సవ్వుతూ సమాధానం చెప్తాను అని చంద్రబాబుతో ప్రమాణం చేయించుకున్నారు బాలయ్య.దానికి బాబు నేను సమయస్పూర్తితో  సమాదానాలు చెప్తాను అని నవ్వులు పూయించారు. అలాగే బాలయ్య మీద ఒట్టు కూడా వేయబోయారు బాబు. ఇక బాలకృష్ణ చంద్రబాబును తన ఫ్యామిలీ సంబందించిన ప్రశాలతో తికమక పెట్టె ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా ఎన్టీరామారావు ఆరోగ్యం గురించిన సీక్రెట్ బయటపెట్టారుఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీ రామారావు నటుడిగా ఎంత ఆకట్టుకుంటారో, పర్సనాలిటీ పరంగానూ అంతే హెల్దీగా ఉంటారు. అయితే ఆయన అరోగ్య రహస్యం బయటపెట్టారు. బాలయ్య,చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో రామారావు ఆరోగ్యం విషయంలో చాలా కేర్‌ తీసుకునేవారు. అయితే ఆయన ఫుడ్‌ విషయంలోనూ తగ్గేవాళ్లు కాదు. ఎంత బాగా తింటారో, అంతే కష్టం కూడా చేస్తారు. ఆ టైమ్‌లో వర్కౌట్స్ చేయడానికి జిమ్‌లు లేవు. అందుకే ఫిజికల్‌గా కష్టపడేవారు. ఉదయం మూడు గంటలకు లేసి ఎక్సర్‌సైజ్‌ కోసం ఆయన ఇంటి వద్ద ఇసుక కుప్పని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎత్తి పోసేవారట. అదే వ్యాయామంగా భావించేవారట. జ్వరం వచ్చిందంటే ఆయన చికెన్‌ తినేవాడట. పెద్దాయన లేవగానే ఓ కోడి మొత్తాన్ని తినేవారని, ఆయన ఆరోగ్య రహస్యం అదే అని చెప్పారు. 60 ఏళ్లు వచ్చినా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటే కారణం ఆయన తీసుకునే ఫుడ్‌, క్రమశిక్షణ అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: