ఆడంబరాల కోసం అప్పులు చేయడం చాలా తప్పని అప్పులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు అనంత శ్రీరామ్.. అలాగే తన ముత్తాత అప్పట్లో లక్ష రూపాయల వరకు అప్పు చేసి ఆ అప్పును తన తాత మీద వేయడంతో ఆ అప్పు తీర్చడానికి తన తాత ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన జీవితం మొత్తం చాలా సింపుల్ లైఫ్ ని గడిపేసారని తెలియజేశారు. ఒకవైపు అప్పులు తీర్చుకొని మిగిలి ఉన్న ఆస్తిని కాపాడుకోవడానికి జీవితం త్యాగం చేయవలసి వచ్చిందని తెలిపారు అనంత శ్రీరామ్.
అందుకే తన దృష్టిలో అప్పు చేయడం చాలా పెద్ద తప్పు అని తెలిపారు. ఆడంబరాలకు పోయి అప్పులు చేయడం వల్ల చివరికి అశాంతి ఉంటుంది అంటూ తెలిపారు. వాయిదా పద్ధతుల ద్వారా కార్లు బంగ్లాలు కొని జీవితాన్ని చాలా లగ్జరీగా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఆ తప్పు చేయాలనుకోవడం లేదంటూ తెలిపారు అనంత శ్రీరామ్.. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడే కొంటానని లేకపోతే ఉన్న జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటానని తెలిపారు అనంత శ్రీరామ్. అప్పులు చేసేటప్పుడు చిన్నవే అనుకున్న కొన్నిసార్లు వీటివల్ల మనశ్శాంతి కూడా కలగాలని కుటుంబాలలో గొడవలు కూడా ఎదురవుతాయని తెలియజేశారు. అయితే తాను పాడే పాటలకు రాసే రాతలకు పెద్ద మొత్తంలోనే తీసుకుంటానని తెలిపారు.