సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక పుకార్లు వినిపిస్తూ ఉంటాయి.. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నదనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు.. కేవలం హెడ్ లైన్స్ వేసుకొని బ్రేకప్లు, ఎఫైర్స్ అంటూ పర్సనల్ విషయాలతో ఆడుకుంటూ ఉంటారు. అలా అప్పట్లో యాంకర్ గా ,నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఝాన్సీ విషయంలో కూడా ఇలాంటి తప్పే జరిగిందట. గత కొన్ని మాసాల క్రితం ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ పలు విషయాల పైన క్లారిటీ ఇచ్చింది.

ఝాన్సీ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ.. తాను ఒక ప్రముఖ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నారని తనని పోలీసులు కూడా ఈ విషయం పైన అరెస్టు చేశారని ఒక వెబ్సైట్లో పిచ్చి రాతలు రాయడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యానని కానీ అలా ఎవరు రాయించారో..ఎందుకు రాయించారో తనకి బాగా తెలుసని.. ఇలాంటి విషయాలు తప్పకుండా దేవుడు గమనిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు వాళ్ళు అనుభవిస్తారు అంటూ తెలిపింది. కానీ నిజా నిజాలు రాసేముందు తెలుసుకొని రాయాలి ఇలాంటి అబాండాలు వేస్తే ఎవరి మనసు అయినా సరే ఇబ్బంది పడుతోంది తనకి కూడా మానసికంగా క్షోభకు గురయ్యాను అంటూ తెలిపింది ఝాన్సీ.


ఈ వార్తల వల్ల తను ఒక పదవి కూడా గతంలో కోల్పోయానని తెలిపింది.. గతంలో తనని కర్ణాటక యూనిసెఫ్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చూసినప్పుడు సరిగ్గా అలాంటి సమయంలోనే ఇలాంటి రూమర్స్ రావడం వల్ల తనకు దక్కాల్సిన ఈ పదవి కూడా రాకుండా పోయిందని తెలిపింది యాంకర్ ఝాన్సీ. మొత్తానికి తన కెరియర్ లోని చాలా ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొన్న యాంకర్ ఝాన్సీ.. ఈమధ్య సినిమాలలో కూడా అడపాదడపా గానే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లోనైనా మరిన్ని చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: