రెండవ స్థానంలో గౌతమ్ మూడవ స్థానంలో టేస్టీ తేజ ఉండగా చివరి రెండు స్థానాలలో హరితేజ, నయని ఉన్నట్లుగా సమాచారం. గడిచిన రెండు రోజుల క్రితం హరితేజ లాస్ట్ లో ఉండగా ఓటింగ్ నీ మెరుగుపరుచుకున్నదని.. కాబట్టి ఈసారి నయని పావుని ఎలిమినేట్ అవ్వబోతోందని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కూడా మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకువచ్చారు మొత్తం మీద 8 మంది 5 వారాల తర్వాత ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వీరిలో నయని పావని కూడా ఒకరు. ఈమె గత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ద్వారా 5 వారాల తరువాతే సేమ్ హౌస్ లోకి అడుగు పెట్టిందట. అలా మొదటి వారం బయటికి వచ్చేసిందట.
అయితే ఈ సీజన్లో మాత్రం ఆ సెంటిమెంట్ ని కాస్త ట్రై చేసిన చిన్న చిన్న విషయాలకు ప్రతిసారి ఏడవడంతో ఆడియన్స్ లో సింపతి రాకపోవడంతో పాటు ఆమె వ్యూహం ఫలించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హౌస్ లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత నయనీపావళి ఎలిమినేట్ అవ్వడానికి రంగం బిగ్ బాస్ సిద్ధం చేస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పదవ వారం బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్ జరగబోతుందని ఇందుకోసం హౌస్ మేర్స్ కూడా కుటుంబ సభ్యులుగా వస్తారని వార్తలు వినిపిస్తున్నా.. ఇందుకోసం హరితేజ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నయని పావని కోసం నటుడు శివాజీ రాబోతున్నారని ప్రచారం వినిపిస్తోంది. శివాజీ పావని కి మంచి స్నేహితుడు.. అంతేకాకుండా ఆమె హౌస్ లోకి వచ్చేటప్పుడే శివాజీనే తన కన్నతండ్రిగా భావించారని తనకు తండ్రి లేడని తెలిపింది. మరి ఏ మేరకు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.