సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పెళ్లిళ్లు విడాకులు అనేవి ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయాయి. ఎప్పుడు ఏ జంట ఒక్కటవుతుందని విషయం చెప్పడం చాలా కష్టంగా మారుతున్నది. పదుల వయసు దాటుతున్నప్పటికీ ఏజ్ బార్లో చాలామంది వివాహాలు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలా ఇప్పుడు ఒక టాలీవుడ్ హీరో బుల్లితెర నటుడైన సాయికిరణ్ 46 ఏళ్ల వయసులో వివాహానికి సిద్ధమైనట్లుగా సమాచారం. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అంటే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. సాయి కిరణ్ చేసుకోబోయేది కూడా బుల్లితెర నటి అన్నట్లుగా తెలుస్తోంది.



గతంలో నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన సాయికిరణ్ ఆ తర్వాత ప్రేమించు సినిమాలో కూడా నటించారు. అయితే నెమ్మదిగా హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. సాయి కిరణ్ ప్రముఖ సింగర్ సుశీల గారి మనవడనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. వెండితెరపై సక్సెస్ కాలేకపోయినా సాయికిరణ్ బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించారు. మొదట కోయిలమ్మ అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు.

సీరియల్ లో బిజీగా ఉండే సాయికిరణ్ తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సాయికిరణ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతి తో సాయికిరణ్ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా స్రవంతి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఏంటి ఇప్పటివరకు ఇంకా సాయికిరణ్ కి వివాహం కాలేదా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నప్పటికీ పలువురు అభిమానులు మాత్రం కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేస్తున్నారు. మొత్తానికి అటు సాయికిరణ్, స్రవంతి ఒక్కటి కాబోతూ ఉండడంతో అభిమానులు ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: