ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక డైరెక్టర్ దగ్గరకి ఆడిషన్ కోసమని వెళ్ళామని అయితే తన వయసు అప్పుడు 16 సంవత్సరాలని.. ఆడిషన్ కి వెళ్లడానికి ముందు తనని సింగల్ గానే రమ్మన్నారని తెలిపింది రష్మీ దేశాయ్.. అయితే తను వెళ్లడానికి ముందు ఒక జ్యూస్ ఇచ్చారని.. దీనివల్ల తాను కళ్ళు తిరిగి పడిపోయానని తెలిపింది.. అది అదునుగా చూసుకున్న డైరెక్టర్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తెలియజేసింది.. ముఖ్యంగా కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చినట్టుగా అనిపించింది అంటూ తెలిపింది రష్మి దేశాయ్.
కానీ తాను కొంచమే తాగడం వల్ల ఆరితేరి ఆ డైరెక్టర్ యొక్క కపట బుద్ధిని అర్థం చేసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. అయితే ఈ విషయం గురించి తన తల్లితో కూడా చెప్పానని ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు మళ్లీ అక్కడికి ఆడిషన్ కి తన తల్లితో పాటు వెళ్లి ఆ డైరెక్టర్ కి తగిన బుద్ధి చెప్పామంటూ తెలియజేసింది. కానీ రష్మీ మాత్రం తనకు ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ పేరు మాత్రం తెలియజేయలేదు. ఇప్పటికీ ఆ డైరెక్టర్ తనను చూస్తే భయపడతారు అంటూ తెలియజేసింది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా ద్వారా వెండితెర పైన ఎంట్రీ ఇచ్చిందట. 2012లో సందీప్ సందును వివాహం చేసుకోగా 2016లో విడాకులు తీసుకున్నదట.