తన ప్రేమ కథను తెలియజేస్తూ తన కథ చాలా విషాదంతా మైనది అంటూ తెలియజేసింది రోహిణి. తన స్నేహితుడే తనని చాలా మోసం చేశారని చాలా బాధపడుతూ తెలిపింది రోహిణి.. రోహిణి మాట్లాడుతూ .. అతను తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని డైమండ్ రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేయడంతో తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తెలపడంతో అవి క్లియర్ అయ్యాకే వివాహం చేసుకుందామన్నాడు.. అందుకు తాను కూడా ఒప్పుకున్నానని తెలిపింది. అయితే అలా లవ్ ప్రపోజ్ చేసిన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు అతను వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు అంటూ ఎమోషనల్ గా తెలియజేసింది రోహిణి.
అయితే ఈ విషయాన్ని సైతం తన దగ్గర దాచారని ఆ తర్వాత ఏదో ఒక సిల్లి రీజన్స్ చెప్పి బ్రేకప్ చెప్పి తన దగ్గర నుంచి వెళ్లిపోయాడు అంటూ తెలియజేసింది రోహిణి. ప్రస్తుతం రోహిణి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు మొదట పలు సీరియల్స్ లో నటించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ అందుకొని ఇప్పుడు పలు సినిమాలలో లేడీ కమెడియన్ గా కూడా అదరగొట్టేస్తోంది. అయితే రోహిణి లవ్ బ్రేకప్ తెలిసి అభిమానులు కాస్త ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.