తెలుగు బిగ్ బాస్ -8 కంటిస్టేంట్స్ లలో ఒకరైన నిఖిల్.. గోరింటాకు సీరియల్ ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ సీరియల్ లోని నిఖిల్ కి జోడిగా కావ్య శ్రీ నటిస్తూ ఉండేది. అలా వీరిద్దరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. అలా ఈ జంట ఎన్నో రకాల ఈవెంట్స్లలో షోలలో కూడా సందడి చేస్తూ ఉండేది. దీంతో ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలుపెట్టారు. అలా వీరి పైన కూడా చాలానే రూమర్స్ వినిపించడమే కాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారననీ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ కూడా ఎక్కువగా వినిపించేది.


అయితే అలాంటి సమయంలోనే అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారట. దీంతో ఒక్కసారిగా ఈ జంట మధ్య బ్రేకప్ జరిగిందని ప్రచారం కూడా వినిపించింది. అయితే తాజాగా నిఖిల్ హౌస్ లో తన లవ్ స్టోరీని చెబుతూ అందర్నీ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. హౌస్ మెట్స్ నే కాదు ప్రేక్షకుల చేత కూడా నిఖిల్ మాటలతో కన్నీళ్లు పెట్టించారు. అయితే నిఖిల్ లవ్ స్టోరీ విన్న ఆడియన్స్ అటు కావ్యాన్ని సైతం టార్గెట్ చేయడం జరిగిందట. కావ్యని అంతగా ప్రేమిస్తున్నాడని ఎందుకు విడిపోయారని... పలువురు నెటిజెన్స్ ఆమెను సోషల్ మీడియాలో ప్రశ్నించారట. అలా ఒక్కసారిగా లవ్ స్టోరీ తో నిఖిల్ కి కూడా మద్దతు పెరిగింది.

అయితే ఈ విషయం పైన కావ్య, నిఖిల్ అసలు నిజ స్వరూపాన్ని బయట పెడుతూ నిఖిల్ పైన ఫైర్ అయ్యింది. మాస్కులు వేసుకొని నటించే వారిని చూసి ఎవరూ కూడా మోసపోవద్దని.. పరిస్థితులకు తగ్గట్టుగానే అందరూ ఫేక్ మాస్కులను ఉపయోగిస్తారని కానీ ఇప్పుడు ఒకసారి వారి అసలు రంగు బయటపడుతుందని తెలిపింది. ఎక్కడ ఎప్పుడు ఎలా యాక్టింగ్ చేయాలో వారికి బాగా తెలుసు అంటూ కావ్య ఒక పోస్ట్ షేర్ చేసింది.. కానీ జనాలకు మాత్రం ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతున్నారు అంటూ నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం నిఖిల్ కి ఈ న్యూస్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: