అయితే ఈ మధ్యకాలంలో ఆమె రెండో వివాహాన్ని మర్చిపోయినప్పటికీ.. ఆమె తల్లి కాబోతోందనే విషయం వైరల్ గా మారుతుండడంతో.. తల్లి కాబోతుందనే వార్తల పైన సింగర్ సునీత మాట్లాడుతూ తాను ప్రెగ్నెంటా?ఈ విషయం నాకే తెలియదు అలాంటి రూమర్స్ అన్నిటిని అసలు పట్టించుకోకండి.. ఇలాంటి రూమర్స్ వల్ల తన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదనీ తెలియజేసింది. ఏదైనా అలాంటిది ఉంటే కచ్చితంగా తన స్వయంగా తెలియజేస్తాను అని కూడా తెలిపింది సింగర్ సునీత. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.
సింగర్ సునీత కొడుకు ఆకాష్ కూడా సర్కారు నౌకరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అని పంచుకుంది. సింగర్ సునీత ప్రస్తుతం పలు రకాల షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉన్నది. అలాగే తన పిల్లల భవిష్యత్తును కూడా ఒకవైపు సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది సింగర్ సునీత. తన జీవితంలో ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నాను అంటే అది తాను రెండవ పెళ్లి చేసుకోవడమే అన్నట్లుగా తెలిపింది. ఇండస్ట్రీలోకి తాను 17 ఏళ్లకే అడుగు పెట్టాను 35 ఏళ్లు వచ్చే వరకు చాలా కష్టపడుతూనే ఉన్నానని కొంతమంది తనని మోసం చేసినప్పటికీ అన్నిటిని తట్టుకొని నిలబడ్డారు అంటూ తెలిపింది సింగర్ సునీత.