తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఒకప్పుడు సినిమాలలో నటించిన రాని క్రేజ్ జబర్దస్త్ ద్వారా సంపాదించి. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే సినిమాలలో పలు కీలకమైన పాత్రలలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. కొన్ని సందర్భాలలో అనసూయ జడ్జిగా కూడా వ్యవహరించిన సందర్భాలు కొన్ని షోలకు ఉన్నాయి. సినిమాల మీద మక్కువతో అనసూయ యాంకర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. వరుసగా పలు చిత్రాలను అవకాశాలు రావడంతో ప్రస్తుతం బిజీ నటిగా పేరు సంపాదించింది. కొన్ని పాత్రలు అనసూయ తప్ప మరెవరు చేయలేరు అనేంతగా నటిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ నిరంతరం ఏవో ఒక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ట్రోల్ కి కూడా గురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అనసూయకు సంబంధించి న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే అనసూయను ఒక వ్యక్తి ఫోన్ చేసి తరచూ రాత్రిపూట ఇబ్బంది పెడుతున్నారట.. ముఖ్యంగా తన రేటు ఎంత అని చెప్పమని అడుగుతున్నాడని .. ఈ విషయం పైన అనసూయ కి విసుగు వచ్చి ఆ వ్యక్తి నెంబర్ బ్లాక్ చేసిన ఇతర నెంబర్ నుంచి ఫోన్ చేసి చాలా విసిగిస్తున్నారట..


దీంతో ఈ విషయాన్ని అనసూయ తన స్నేహితులకు చెప్పి మరి బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ అవుతున్నది.ప్రస్తుతం అయితే అనసూయ పుష్ప-2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికి హీరోయిన్లకు దీటుగానే తన అంద చందాలతో ఆకట్టుకుంటోంది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: