పలు చిత్రాలలో హీరోయిన్ గా, నటిగా నటించిన తెలుగు అమ్మాయిగా పేరుపొందింది నటి తేజస్వి మదివాడ. గతంలో టెలివిజన్ షోలలో పనిచేసిన ఈ అమ్మడు.. మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో మనం, హార్ట్ ఎటాక్ వంటి చిత్రాలలో కూడా నటించింది.. అలాగే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్గా కూడా నటించి తన అందచందాలతో మైమరిపించింది. 2018లో బిగ్ బాస్ -2 లో కంటిస్టెంట్ గా పాల్గొనింది తేజస్వి మదివాడ.


అయితే ఈమె నటించిన పాత్రలు అయితే బాగానే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహ లో స్ట్రీమింగ్ అవుతున్న అర్థమయిందా అరుణ్ కుమార్ అనే సీజన్లో ఉన్నది.. ఈమె ఇందులో బికినీలో కనిపించింది. అంతేకాకుండా బోల్డుగా కనిపించడంపై పలు విషయాలను తెలియజేసింది తేజస్వి మదివాడ.. తాను ఎప్పుడూ కూడా ఎక్స్పో జ్ చేయాలనుకోలేదని.. తనకు మంచి పాత్ర వస్తే కచ్చితంగా చేస్తాను తెలుగు అమ్మాయిని కాబట్టి తాను షార్ట్ వేసుకోవడానికి సిగ్గుపడేదాన్ని మన ఇండియాలో మనం షార్ట్స్ వేసుకొని బయటకు వెళ్తే  అంత కంఫర్టబుల్గా ఉండదు.. కానీ మన చుట్టూ ఉండేవారు బికినీలు వేసుకున్నప్పుడే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటామని తెలిపింది.


తాను ఐదేళ్ల క్రితం మాల్దీవులకు వెళ్ళినప్పుడు బికినీ వేసుకున్నానని.. తనని తాను చూసుకున్నప్పుడు అందంగా కనిపించడంతో తాను యాక్సెప్ట్ చేశానని తెలిపింది.. ప్రస్తుతం తన వయసు 33 ఏళ్లు తన శరీరం కూడా ఫిట్ గా ఉంది అందంగా ఉంది అందుకే బికినీ వేసుకోవాలనుకున్నానని అది ఇప్పుడు అవకాశం రావడంతో వేసుకున్నానని తెలిపింది. అయితే తన పాత బాయ్ ఫ్రెండ్ తనని నమ్మడని కానీ ప్రస్తుతం ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే తనని ఒక చిన్న పిల్లాడిలా చూస్తారని.. తన బాయ్ ఫ్రెండ్ కూడా బికినీలో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడని.. అన్ని విషయాలలో తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని తెలిపింది తేజస్వి..చాలామంది స్టార్ హీరోలు తమ శరీరాలని గుండీలు విప్పి మరి చూపిస్తున్నారు కానీ తాను బికినీ వేస్తే మాత్రం ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతున్నారని తెలిపింది.. బికినీ కోసం జిమ్ముకు వెళ్లి బాడీని కూడా డెవలప్ చేశానని అందుకే బికినీలో కంఫర్టబుల్గా ఉన్నానని తెలిపింది తేజస్వి మదివాడ.

మరింత సమాచారం తెలుసుకోండి: