ప్రస్తుతం పదిమంది హౌస్ లో కొనసాగుతున్నారు .వారిలో కన్నడ బ్యాచ్ నలుగురితోపాటు నబీల్, విష్ణుప్రియ అలాగే టేస్టీ తేజ, రోహిణి, ముక్కు అవినాష్ , గౌతమ్ ఇలా మొత్తం పదిమంది కొనసాగుతుండగా.. వారిలో ఈ వారం నామినేషన్స్ లోకి ఐదు మంది వచ్చేసారు. అలా పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, యష్మీ తో పాటూ నబీల్ ఇలా ఐదు మంది నామినేషన్స్ లోకి రాగా 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా యష్మీ ఎలిమినేట్ అయింది. ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఈమె చివరిలో కంటెస్టెంట్స్ తో గొడవ పడడం ఆమె గ్రాఫ్ పై ప్రభావం పడింది. మొత్తానికి ఈరోజు హౌస్ నుంచి వెళ్ళిపోబోతోంది యష్మీ.
ఇకపోతే 12 వారాలకు గానూ యష్మీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వినిపిస్తున్నాయి. ఇకపోతే వారానికి రూ. 2లక్షలు చొప్పున ఒప్పందంతో హౌస్ లోకి అడుగు పెట్టిన యష్మీ కి 12 వారాలకు గానూ రూ.24 లక్షల లభించినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఏడాది పాటు సీరియల్స్ లో నటిస్తే వచ్చే అమౌంట్ కేవలం 3 నెలల్లోనే బిగ్ బాస్ ద్వారా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.