తెలుగులో యాంకర్ గా గతంలో ఎన్నో షోలు చేసిన  లేడీ యాంకర్ విష్ణు ప్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-8 లో కూడా ఎంట్రీ ఇచ్చి బాగానే నెట్టుకొస్తుంది. మరో కొద్ది వారాలలో బిగ్బాస్ షో ముగియబోతూ ఉన్నది.. ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ 9 మంది మాత్రమే ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో బిగ్ బాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, టేస్టీ తేజ, ముక్కు అవినాష్, రోహిణి, విష్ణు ప్రియ, పృథ్వీ ఉన్నారు.


అయితే హౌసులో అందరూ రాత్రి పడుకున్న తర్వాత రాత్రి సమయంలో పృథ్వీ దగ్గరకు రెండు గంటల సమయంలో విష్ణు ప్రియ వెళ్లి అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతూ ఉన్నదట. తన లవ్ స్టోరీ ని కూడా చెప్పడం జరిగింది యాంకర్ విష్ణు ప్రియ.. తనకు నైట్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలలోకి వచ్చారంటూ విష్ణు ప్రియ చెప్పడంతో.. ఆ కల చొప్పలేనంతగా వచ్చిందా అంటూ మరో కంటెస్టెంట్ పృథ్వీ అడగగా దీనికి .. హౌస్ లో తనకు జరిగిన విషయాలన్నీ చూసి బాధపడి ఉంటాడు అని వచ్చిందని తెలిపింది విష్ణు ప్రియ.


అలాంటిది నువ్వేం చేసావ్ అంటూ పృథ్వి విష్ణు ప్రియను అడగక.. తనకోసమే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒంటరిగా ఉన్నారని ఇంకా వివాహం చేసుకోలేదని తెలిపింది.. తనకు మంచి జరగడం కోసం రెండు తప్పులు చేశారని తన దగ్గర కొన్ని విషయాలు దాచారు.. అయితే ఆ విషయాలు తనకు తెలియడం జరిగిందని.. తన దగ్గర చెప్పకుండా దాచడం చాలా తప్పుని అలాంటి గట్స్ లేని వ్యక్తితో ఉండాలనిపించలేదంటూ తెలిపింది యాంకర్ విష్ణు ప్రియ. కానీ ఆ తప్పు ఏంటి అది కూడా యాంకర్ విష్ణు ప్రియ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? విష్ణు ప్రియ మిన్కోసం చేసిన విషయం ఏంటన్నది రాబోయే రోజుల్లో ఆయన చెబుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: