అలా దొరికిపోయినప్పటికీ కూడా ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకొని ఆడియోస్లో సింపతి కొట్టేసేది యష్మి.. అలాగే మరొకవైపు హౌస్ లో గౌతమ్ తనపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారని.. తన ప్రేమని తెలియజేసిన కూడా ఆమె తిరస్కరించింది. మొదట్లో హౌస్ లో నాగమణికంఠ ప్రతిసారి యష్మి నీ హగ్ చేసుకోవడంతో ఒక పెద్ద రచ్చే జరిగింది.. కానీ యష్మి మాత్రం ఎక్కువగా నిఖిల్, పృథ్వీరాజులను మాత్రమే హగ్ చేసుకుంటూ కనిపించేది. వీరితో కలిసి అన్ని షేర్ చేసుకోవాలని చూసినప్పటికీ.. అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో చివరికి ఆమె ఎలిమినేషన్ కి కూడా కారణమయ్యింది.
హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడే యష్మి లవ్ ఫెయిల్యూర్ అయ్యానని తెలియజేసింది.. ఇకమీద ప్రేమలో పడనని.. ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదనే విధంగా తెలియజేసింది.. కాలేజ్ నుంచి ఒక వ్యక్తిని ప్రేమించాను.. కానీ తన ప్రియుడికి మాత్రం సినిమాలలో కనిపించడం ఇష్టం లేదనీ.. సినిమాలు మానేయనీ చెప్పడంతో ఈ విషయంపై నో అని చెప్పానని.. అలా మా మధ్య దూరం పెరిగిందని..దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని తెలిపింది.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత యష్మి, నిఖిల్ కి బాగా దగ్గరయింది.. దీంతో ఆమె కోసం జాకెట్ ఇవ్వడం జరిగింది నిఖిల్.. ఆ జాకెట్ ను తన వద్ద యష్మి దాచుకున్నది.. దీంతో ఆయనతో లవ్ లో పడిందనే విధంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఈ విషయాలను నిజం చేస్తూ.. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా నిఖిల్ ఇచ్చిన జాకెట్ తో ఒక అభిమానితో సెల్ఫీ దిగుతూ కనిపించింది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి యష్మి మరొకసారి ప్రేమలో పడిందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.