ఒకప్పుడు సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సాయికిరణ్,  ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో చేస్తూ అటు సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ అందుకున్నారు. ఈయన  2010లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం పాప బాధ్యతను ఇద్దరూ తీసుకున్నారా?  లేక ఒక్కరిపైనే ఉందా? అన్న విషయం తెలియదు. ఇదిలా ఉండగా సాయి కిరణ్ ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి.సుశీల కి మనవడు వరుస అవుతారు.

నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, ఆ తర్వాత లయతో కలిసి ప్రేమించు అనే సినిమాలో సోలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే ఎంత బాగుందో, మనసుంటే చాలు వంటి చిత్రాలలో కూడా హీరోగా నటించారు. కొన్ని రోజులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన సాయికిరణ్ ఇప్పుడు బుల్లితెరపై వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం, కోయిలమ్మ వంటి సీరియల్స్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితమే తనతో పాటు కోయిలమ్మ సీరియల్ లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్న ఈయన ఇప్పుడు పెళ్లి పనులలో బిజీగా మారినట్లు తెలుస్తోంది. గతంలోనే నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇరువురు షేర్ చేసి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని అందరికీ బహిర్గతం చేశారు. తర్వాత కెరియర్ లో బిజీ అయిన వీరు ఇక త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ డిసెంబర్ ఆఖరి లేదా మాఘమాసంలో వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా త్వరలోనే వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారు అని తెలిసి,  అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: