తమిళనాడుకు చెందిన ఈమె బీటెక్ పూర్తి చేసుకుని.. తమిళ ఛానల్లో న్యూస్ ప్రజెంట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన దీపికా రంగరాజు ఆ తర్వాత చిత్రీరమ్ పేసుతాడి అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీపికా రంగరాజ్ ఒక్కసారిగా మలుపు ఈమె కెరియర్ను మలుపు తిప్పింది. ఇందులో ఈమె నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తెలుగులో కూడా స్టార్ మా నిర్వహించిన బ్రహ్మముడి సీరియల్ అవకాశాన్ని అందుకున్నది. అందులో కావ్య పాత్రలు అద్భుతంగా నటించింది దీపికా రంగరాజు. ఈ సీరియల్ లో ఎంతో ఓర్పుతో అమాయకంగా నిజాయితీగా ఉండే పాత్రలు నటించింది.
తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దీపికా రంగరాజు సోషల్ మీడియాలో కూడా తన సీరియల్స్ షూటింగ్ అప్డేట్ విషయాలను తప్ప మరే విషయాలను పంచుకునేది కాదు. అయితే తమిళంలో కూడా ఒక చిత్రంలో నటించింది.. ఆ సినిమాని ఆరాడి. అయితే ప్రస్తుతం దీపిక రంగరాజు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని అది కూడా ఒక సీరియల్ హీరోతో ఈమె పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.. వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు అంగీకారమని కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే వీరు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. మరి దీపిక రంగరాజు మనసు గెలుచుకున్న ఆ సీరియల్ హీరో ఎవరు అనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం పైన దీపిక ఎలా స్పందిస్తుందో చూడాలి.